Yadapoinado song Lyrics| Aravinda sametha | in Telugu
YEDA POINADO
Singers – Nikhita Srivalli, Kailash Kher, Penchal Das
Lyrics – Sirivennela Seetharama Sastry, Penchal Das.
ఏ కోనలో కూడినాడో….
ఏ కొమ్మలో చేరినాడో….
ఏ ఊరికో.. ఏ వాడికో
ఏడ బొయ్యాడో….
రం రుధిరం.. సమరం.. శిశిరం..
రం మరణం.. గెలవమ్.. ఎవరం..
ఏడ బోయినాడో.. ఏడ బోయినాడో..
సింతలేని లోకం.. సూడబోయి నాడో..
చారడేసి గరుడ పచ్చ.. కళ్లు వాల్చి
గరికపచ్చా.. నేలపైనే..
సీమ కచ్చా.. వేటు వేస్తే..
రాలిపోయినాడో..
రం రుధిరం.. సమరం.. శిశిరం..
రం మరణం.. గెలవమ్.. ఎవరం..
కట్టెలే సుట్టాలు.. కాదు మన తల్లి
అగ్గిదేవుడే మనకు ఆత్మబంధువుడంట..
కాలవగట్టూనా.. నీ కాళ్లు కాలంగా..
కాకి శోకమున్ బోతిమే.. కాకి శోకమున్ బోతిమే..
నరక స్వర్గా అవధి దాటి..
వెన్నామాపులు దాటీ..
విధియందు రారానీ..
తదియందు రారానీ..
నట్టింట ఇస్తర్లు..
నాణ్యముగా పరిపించీ..
నీ వారు చింతా పొయ్యేరూ….
నీ వారు దు:ఖ పొయ్యేరూ….
మృత్యువు మూకుడు మూసిన ఊళ్లకు
రెక్కలు తొడిగేదెవరని..
ఇంకని చెపలు పారే శోకం..
తూకం వేసేదెవరని..
కత్తుల అంచున.. ఎండిన నెత్తురు
కడిగే అత్తరు ఎక్కడని..
ఊపిరాడనీ.. గుండెకు గాలిని….
కబలం ఇచ్చేదెవ్వరనీ..
చుక్కేలేని నింగీ.. ప్రశ్నించిందా… వంగీ….
ఏ కోనల్లో.. కూలినాడో….
ఏ కొమ్మల్లో చేరినాడో….
రం రుధిరం.. సమరం.. శిశిరం..
రం మరణం.. గెలవమ్.. ఎవరం..
హరోం.. హరీ.. నీ కుమారులిచ్చిన భక్ష భోజనములు..
రాగికానులు.. ఇరం విడిచి పరం జేరిన
వారి పెద్దలకు.. పేరంటాలకు..
మోక్షాదిఫలము శుభోజయము..
పద్నాలుగు తరాల వారికి
మోక్షాదిఫలము కల్గును
శుభోజయము.. శుభోజయము
Check other Lyrics Here Of Aravinda Sametha Veera raghava
Reddy Ikkada soodu Song Lyrics.
Anaganagana Song Lyrics.
Peniviti Song Lyrics.
Reddamma thalli Song Lyrics.
Yada poinado Song Lyrics.
https://lyricdunia.com/yadapoinado-song-lyrics-aravinda-sametha-in-telugu/https://lyricdunia.com/wp-content/uploads/2018/10/yadapoinado1716280291-1-1024x564.jpghttps://lyricdunia.com/wp-content/uploads/2018/10/yadapoinado1716280291-1-150x150.jpgతెలుగు సాంగ్స్Aravinda sametha,Jr.NTR,trivikram,yadapoinaadoYEDA POINADO
Singers - Nikhita Srivalli, Kailash Kher, Penchal Das
Lyrics - Sirivennela Seetharama Sastry, Penchal Das.
ఏ కోనలో కూడినాడో....
ఏ కొమ్మలో చేరినాడో....
ఏ ఊరికో.. ఏ వాడికో
ఏడ బొయ్యాడో....
రం రుధిరం.. సమరం.. శిశిరం..
రం మరణం.. గెలవమ్.. ఎవరం..
ఏడ బోయినాడో.. ఏడ బోయినాడో..
సింతలేని లోకం.. సూడబోయి నాడో..
చారడేసి గరుడ పచ్చ.. కళ్లు వాల్చి
గరికపచ్చా.. నేలపైనే..
సీమ కచ్చా.. వేటు వేస్తే..
రాలిపోయినాడో..
రం రుధిరం.. సమరం.. శిశిరం..
రం మరణం.. గెలవమ్.. ఎవరం..
కట్టెలే...
Ash
Reddykumbam.ashwin@gmail.comAdministratorLyricDunia
Leave a Reply