Vasthunnaa vachestunna song Telugu lyrics-v Movie-Nani
Vasthunnaa vachestunna song Telugu lyrics v Movie Nani
చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక..
వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా…

ఏం చేస్తున్న ధ్యాసంతా నీమీదే తెలుసా…
నిను చూడనిదే ఆగనని ఊహల ఉబలాటం..
ఉసి కొడుతుంటే..
వస్తున్న వచ్చేస్తున్నా.. వద్దన్నా వదిలేస్తానా..
కవ్విస్తూ కనబడకున్నా.. ఉవ్వెత్తున ఉరికొస్తున్న…
చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక..
వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా…
చెలియా చెలియా.. నీ. తలపే తరిమిందే.
అడుగే అలలయ్యే ఆరాటమే పెంచనా..
గడియో క్షణమో.. ఈ దూరం కలగాలే..
ప్రాణం బాణంలా విరహాన్ని వేటాడగా..
మురిపించే ముస్తాబై ఉన్నా..
దరికొస్తే అందిస్తాగా, ఆనందంగా…
ఇప్పటి ఈ ఒప్పందాలే.. ఇబ్బందులు తప్పించాలే..
చీకటితో చెప్పించాలే.. ఏకాంతం ఇప్పించాలే
వస్తున్న వచ్చేస్తున్నా.. వద్దన్నా వదిలేస్తానా..
కవ్విస్తూ కనబడకున్నా.. ఉవ్వెత్తున ఉరికొస్తున్న…
చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక..
వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా…
Leave a Reply
You must be logged in to post a comment.