Thursday, January 9

Sankranthi vachindi tummeda song lyrics| Soggadi pellam

0

సంక్రాంతి వచ్చిందే తుమ్మెద
సరదాలు తెచ్చిందే తుమ్మెద
కొత్త ధాన్యాలతో కోడి పందాలతో
ఊరే ఉప్పొంగుతుంటే ఏ ఏ ఏ
ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం
కొత్త అల్లుళ్ళతో కొంటె మరదళ్ళతో పొంగే హేమంత సిరులు

గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో
గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో

మంచిమర్యాదని పాపపుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు
న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు
బీద గొప్పోళ్ళని మాట లేదు
నీతి నిజాయతీ మాసిపోదు
మచ్చలేని మనసు మాది
మంచి పెంచు మమత మాది
ప్రతి ఇళ్ళో బొమ్మరిల్లు

సంక్రాంతి వచ్చిందే తుమ్మెద
సరదాలు తెచ్చిందే తుమ్మెద హొ హొ హొ

పాటే పంచామృతం మనసే బృందావనం
తడితేనే ఒళ్ళు ఝల్లు
మాటే మకరందము చూపే సిరిగంధము
చిరునవ్వే స్వాతిజల్లు
జంట తాళాలతో మేజువాణి
జోడు మద్దెళ్ళని మోగిపోనీ
చెంతకొస్తె పండగాయె
చెప్పలేని బంధమాయె
వయసే అల్లాడిపోయె

సంక్రాంతి వచ్చిందే తుమ్మెద
సరదాలు తెచ్చిందే తుమ్మెద
హొయ్ కొత్త ధాన్యాలతో కోడి పందాలతో
ఊరే ఉప్పొంగుతుంటే ఏ ఏ ఏ
ఇంటింటా పేరంటం ఒయ్ ఒయ్ ఒయ్ ఊరంతా ఉల్లాసం
కొత్త అల్లుళ్ళతో కొంటె మరదళ్ళతో పొంగే హేమంత సిరులు

Share.

About Author

Leave A Reply