Thursday, January 9

Samajavaragamana

0
Song : Samajavaragamana
Movie : Ala Vaikuntapuram lo.
నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
నీ కళ్లకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు
నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ ఉంటే ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా, నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు
సామజవరగమనా
నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా
సామజవరగమనా
నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా
నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
మల్లెల మాసమా
మంజుల హాసమా
ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా
విరిసిన పించమా
విరుల ప్రపంచమా
ఎన్నెన్ని వన్నెసిన్నెలంటే ఎన్నగ వశమా
అరె’ నా గాలే తగిలినా
నా నీడే తరిమినా
ఉలకవా పలకవా భామా
ఎంతో బతిమాలినా
ఇంతేనా…
Share.

About Author

Leave A Reply