పల్లవి:
నల్లంచు తెల్ల చీర కట్టాను గాని
తల్లోన మల్లె పూలు పెట్టాను గాని
కనురెప్పలకేమో కాటుక రుద్దాను గాని
పెదవులకు రంగులు ఏవో అద్దాను గాని
నా మొఖమే చూస్తే మీకు సుఖమిచ్చే దాన్ని
ఎనుకున్న నరకం ఎవరు గుర్తించారు గాని సూపులకేమో నేను దొరసాని
లో లోపల మాత్రం నా పేరు సాని
నల్లంచు తెల్ల చీర కట్టాను గాని
తల్లోన మల్లె పూలు పెట్టాను గాని
సూపులకేమో నేను దొరసాని
దేవ దేవా రా
లో లోపల మాత్రం నా పేరు సాని
నీది నాది కాదు తల్లి
ఇది పై వాడి ఆటనే సెల్లె
దేవానా దేవుళ్ళనాడే ఈ సిత్రాలు ఉన్నాయ్ తరిసి సూడే

చరణం:1

నా అన్న కానీ నాన్న
పడమటి అర్రలో
నన్ను తోసే బ్రతుకు పోరులో
అమ్మ నుండి నాకు దక్కినవరము
అమ్మితేనే ఒళ్ళు అన్నము
ఎముకల గూడు నేను
ఎనకల గోడ నేను
నీ మొరటు చేతుల్లోన నలిగి పోను
నీ ఆనందాల కోసం చేస్తాయి ఏదేదో శబ్దం
వినగలిగే మగ వాడెవ్వడు ఎదచప్పుడు
సూపులకేమో నేను దొరసాని
లో లోపల మాత్రం నా పేరు సాని

ఎవ్వరికి ఎవరే ఈ లోకాన హరి గోస తీస్తున్నవ్ లోలోన
కాగడా వెలుగే చూస్తారే పైన కాలే గాయాలే కనిపించేనా

చరణం:3

ఆట,పాట,ప్రేమ,పెళ్లి పేరంటం అన్ని ఆశలున్న నలుసుని
నల్ల మబ్బులోకి వెళ్లిపొమ్మని దాచినాను చందమామని
డబ్బున్న మగమహారాజు నా ఇంటికి వస్తూ పోతే మాగొప్ప రసికుడు అంటూ పొగిడేస్తారు
నీ కామ దాహం తీర్చి
కరిగే నా బ్రతుకును మాత్రం హీనంగా చూస్తూ ఎందుకు ఛీ కొడతారు
సూపులకేమో నేను దొరసాని
లో లోపల మాత్రం నా పేరు సాని
అందరిలో జంతువు ఉంటది ఈడ సందర్భం చూపును దాని జాడ ఎవరెవరి గుట్టుందో నీ కాడ
నేనైతే గా ముచ్చట మాట్లాడ