రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా..
చుక్కలంటిన ఆశ నేలకి ఒరిగిందా..
ఒక ప్రేమను కాదందమ్మా ఇపుడింకో ప్రేమ..
ఇక ఇంటికి రాదందమ్మా ఎద రాజీనామా..
కురిసే కన్నీరే వరదయ్యే వేళ…
రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా..
చుక్కలంటిన ఆశ నేలకి ఒరిగిందా..

రేపటికే సాగే పయనం నిన్నటినే చూడని నయనం
గమ్యలే మారే గమనం ఆగదు ఏమాత్రం
బ్రతుకంతా ఈడుటుంద చివరంత తోడుటుంద
నది దాటని నావల కోసం ఎందుకు ఈ ఆత్రం
ఆకాశం ఇల్లవుతుంద రెక్కలు వచ్చాకా
అనురాగం బదులిస్తుందా ప్రశ్నై మిగిలాక
కలలే నిజమవున కలవరమేమైన…
రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా..
చుక్కలంటిన ఆశ నేలకి ఒరిగిందా..

నీవే ఓ అమ్మయ్యాక నీ అమ్మే గుర్తొచ్చాక
నీ కథ నీకెదురయ్యక రగిలింద గాయం
పువ్వులనే పెంచే మాలి ముల్లలో వెతకడు జాలి
తిరిగింద నిన్నటి గాలి ఏ మనసైనా మాయం
ఏనాడో రాసడమ్మ తలరాతే బ్రహ్మ
ఆ రాతను చదివావేమో అయ్యాకే అమ్మ
బ్రతుకే నవలైనా కతలింతే ఎవైన
గుండెలో దాగిన ప్రేమ గూటికి చేరింద
కంటిని వీడిన పాపా కన్నుగా మిగిలిం…