ఆగిపోయినది మాట
మూగపోయి నాది పాట..
సామి సమయమైన దాట
పట్టినాడు దేవుని బాట….
తల్లడిల్లే కోనెటమ్మ పేటా…
పిల్లగాడు ఇల్లొదిలి ఎల్లినడటా…
తమిళ తెలుగు మలయాళ కన్నడ నాటా…
దేశమంతా విషాదం ఈ పుటా….
వినరా భారత వీరకుమారా ముగిసినదతని కథ,
నేడు ముగిసినదతని కథ.
విలువలు మనలోన నాటిన బాలుడు విశ్రాంతి కోరిండు కదా
నేడు విశ్రమించినాడు కదా.
అచ్చతెలుగు మాట గుచ్చి పలుకుతుంటే పరవశించిపోయే ఎదా..
పచ్చిపాల నురుగ సిలకరించి నట్టు పాట పాడుతారు సదా.
యాడ కానరాడు కదా… చెదిరిపాయే తెలుగు సంపద…
ఆ యమున మీద మన్ను పడా …
కన్నేసే గంధర్వుడి గొంతుమీద…
అయ్యా చెప్పే హరికథ, అబ్బినది జన్మత, అక్కడనే మొదలట తనలో పాట.
పల్లవినే కన్నడు చరణం కనుగొన్నడూ…
ఆ పాట గాడి పాఠనలో పలుకుతుందట.. పాటే మిగిలినాదట…
ఓం శాంతి గురువుగారు
Leave a Reply
You must be logged in to post a comment.