చిత్రం : ఆనంద్ (2004)
రచన : వేటూరి సుందర రామమూర్తి
సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్
గానం : శ్రేయా ఘోషల్, కె.ఎం. రాధాకృష్ణన్

నువ్వేనా.. నా నువ్వేనా Telugu lyrics

నువ్వేనా.. నా నువ్వేనా
నువ్వేనా.. నాకు నువ్వేనా
సూర్యుడల్లే సూదిగుచ్చి సుప్రభాతమేనా
మాటలాడే చూపులన్నీ మౌనరాగమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
ఆ.. ఆనందమేనా.. ఆనందమేనా..
నువ్వేనా.. నా నువ్వేనా
నువ్వేనా.. నాకు నువ్వేనా

మేఘమల్లే సాగివచ్చి దాహమేదో పెంచుతావు
నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు
కలలేనా.. కన్నీరేనా..

తేనెటీగ లాగ కుట్టి తీపిమంట రేపుతావు
పువ్వులాంటి గుండెలోన దారమల్లే దాగుతావు
నేనేనా.. నీ రూపేనా..

చేరువైనా దూరమైనా ఆనందమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
ఆ.. ఆనందమేనా.. ఆనందమేనా..
నువ్వేనా.. నా నువ్వేనా
నువ్వేనా.. నాకు నువ్వేనా

కోయిలల్లే వచ్చి ఏదో కొత్తపాట నేర్పుతావు
కొమ్మగొంతులోన గుండె
కొట్టుకుంటె నవ్వుతావు
ఏ రాగం.. ఇది ఏ తాళం..

మసక ఎన్నెలల్లే నీవు
ఇసక తిన్నె చేరుతావు
గసగసాల కౌగిలంత గుసగుసల్లె మారుతావు
ప్రేమంటే.. నీ ప్రేమేనా..

చేరువైనా దూరమైనా ఆనందమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
ఆ.. ఆనందమేనా.. ఆనందమేనా..
నువ్వేనా.. నా నువ్వేనా
నువ్వేనా.. నాకు నువ్వేనా

Nuvvenaa.. naa nuvvenaa
Nuvvenaa.. naaku nuvvenaa
Suryudalle sudhi guchi suprabhathamena
Maatalaade chupulanni mounaraagamenaa
Cheruvaina dhuramaina aanandhamenaa
Cheruvaina dhuramaina aanandhamenaa
Aa.. aanandhamena.. aanandhamenaa
Nuvvena.. naa nuvvenaa
Nuvvenaa.. naaku nuvvenaa

Meghamalle saagi vacchi
Dhahamedho penchuthavu
Neeru gundelona dhachi
Merisi maayamouthavu
Kalalenaa.. kannirenaa..

Thenetiga laaga kutti
Thipi manta reputhavu
Puvvulaanti gundelona
Dharamalle dhaguthavu
Nenenaa.. nee rupenaa..

Cheruvaina dhuramaina aanandhamenaa
Cheruvaina dhuramaina aanandamenaa
Aa.. aanandhamena.. aanandhamenaa
Nuvvena.. naa nuvvenaa
Nuvvenaa.. naaku nuvvenaaa

Koyilalle vacchi yedho
Kotha paata nerputhavu
Komma gonthulona gunde
Kottu kunte navvuthavu
Ee raagam.. idhi e taalam..

Masaka yennelalle neevu
Isaka thinne cheruthavu
Gasa gasaala kougilintha
Gusa gusalle maaruthavu
Premante.. nee premenaa..

Cheruvaina dhuramaina aanandhamenaa
Cheruvaina dhuramaina aanandamenaa
Aa.. aanandhamena.. aanandhamenaa
Nuvvena.. naa nuvvenaa
Nuvvenaa.. naaku nuvvenaaa

 Telugu lyrics

 

https://lyricdunia.com/wp-content/uploads/2018/09/photostudio_1537421132062.pnghttps://lyricdunia.com/wp-content/uploads/2018/09/photostudio_1537421132062-150x150.pngAshతెలుగు సాంగ్స్
చిత్రం : ఆనంద్ (2004) రచన : వేటూరి సుందర రామమూర్తి సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్ గానం : శ్రేయా ఘోషల్, కె.ఎం. రాధాకృష్ణన్ నువ్వేనా.. నా నువ్వేనా Telugu lyrics నువ్వేనా.. నా నువ్వేనా నువ్వేనా.. నాకు నువ్వేనా సూర్యుడల్లే సూదిగుచ్చి సుప్రభాతమేనా మాటలాడే చూపులన్నీ మౌనరాగమేనా చేరువైనా దూరమైనా ఆనందమేనా చేరువైనా దూరమైనా ఆనందమేనా ఆ.. ఆనందమేనా.. ఆనందమేనా.. నువ్వేనా.. నా నువ్వేనా నువ్వేనా.. నాకు నువ్వేనా మేఘమల్లే సాగివచ్చి దాహమేదో పెంచుతావు నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు కలలేనా.. కన్నీరేనా.. తేనెటీగ లాగ కుట్టి తీపిమంట...