నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే అదేమిటే
నిన్ను చూడకుంటె రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే

ఏమిటో ఏం మాయో చేసినావె కంటి చూపుతోటి
ఏమిటో ఇదేమి రోగమో అంటించినావె ఒంటి ఊపుతోటి
ముంచే మరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా

నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే అదేమిటే
నిన్ను చూడకుంటె రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే

అంత పెద్ద ఆకాశం అంతులేని ఆ నీలం
నీ చేప కళ్ళ లోతుల్లో ఎట్ట నింపావే ఇరగదీశావే
భూమిలోన బంగారం దాగి ఉందనేది ఓ సత్యం
దాన్ని నువ్వు భూమి పైన పెరిగేస్తూ ఇట్ట తిరిగేస్తూ తిరగరాశావే
హే అలా నువ్వు చీర కట్టి చిందులేస్తె చీమలా నేను వెంటపడనా
నావలా నువ్వు తూగుతూ నడుస్తు ఉంటె కాపలాకి నేను వెంట రానా
క్రిష్ణా రాధలా నొప్పి బాధలా ఉందాం రావె మరదలా

నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే అదేమిటే

మోనాలిసా చిత్రాన్ని గీసినోడు ఎవడైనా
ఈ పాల సీసా అందాన్ని చూడనే లేదు ఇంక ఏం లాభం
కోహినూరు వజ్రాన్ని ఎత్తుకెళ్ళినోడు రాజైనా
దాని మెరుపు నీలోనే దాగి ఉందని తెలియలే పాపం
ఇంతిలా నువ్వు పుట్టుకొస్తే
నేను మాత్రం నిన్నెంతనీ పొగిడి పాడగలను
తెలుగు బాషలో నాకు తెలిసినా పదాలు అన్నీ
కుమ్మరించి ఇంత రాసినాను
సిరి వెన్నెల మూటలా వేటూరి పాఠలా ముద్దుగున్నవె మరదలా

నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే అదేమిటే

నిన్ను చూడకుంటె రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే

https://lyricdunia.com/wp-content/uploads/2018/11/ninnuchoodagane15435637579331572531545.jpghttps://lyricdunia.com/wp-content/uploads/2018/11/ninnuchoodagane15435637579331572531545-150x150.jpgAshEver Green Lyrical Songs
నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే అదేమిటే నిన్ను చూడకుంటె రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే ... ఏమిటో ఏం మాయో చేసినావె కంటి చూపుతోటి ఏమిటో ఇదేమి రోగమో అంటించినావె ఒంటి ఊపుతోటి ముంచే మరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా ... నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే అదేమిటే నిన్ను చూడకుంటె రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే ... అంత పెద్ద ఆకాశం అంతులేని ఆ నీలం నీ చేప కళ్ళ లోతుల్లో ఎట్ట...