నీ కళ్ళతోటి నా కళ్ళలోకి
చూస్తేనే చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుతుంటే
తనువంత సూర్యోదయం
ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే
క్షణాలే కదా ఓ వరం
అలాగే అలాగే ప్రపంచాలు పలికే
కధవ్వాలి మనమిద్దరం

నీ కళ్ళతోటి నా కళ్ళలోకి
చూస్తేనే చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుతుంటే
తనువంత సూర్యోదయం

అడుగునవుతాను నీ వెంట నేను
తోడుగా నడవగా చివరి దాకా
గొడుగునవుతాను ఇకపైన నేను
వానలో నిన్నీలా తడవనీక
నిన్నొదిలి క్షణమైన అసలుండలేను చిరునవ్వునవుతాను పెదవంచునా
నీ లేత చెక్కిళ్ళ వాకీళ్ళలోనే
తొలి సిగ్గు నేనవ్వనా

నీ కళ్ళతోటి నా కళ్ళలోకి
చూస్తేనే చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుతుంటే
తనువంత సూర్యోదయం

వెన్నెలవుతాను ప్రతి రేయి నేను
చీకటే నీ దరికి చేరకుండా
ఊపిరవుతాను నీలోన నేను
ఎన్నడు నీజతే వదల కుండా
నా రాణి పాదాలు ముద్దాడుకుంటూ నేనుండిపోతాను పారాణిలా
చిరు చెమట పడుతుంటే నీ నుదురు పైనా
వస్తాను చిరుగాలి లా

https://lyricdunia.com/wp-content/uploads/2018/11/nikallathoti1099078469.jpghttps://lyricdunia.com/wp-content/uploads/2018/11/nikallathoti1099078469-150x150.jpgAshEver Green Lyrical Songsnayanathara,tulasi,venkatesh
నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం అలాగే అలాగే ప్రపంచాలు పలికే కధవ్వాలి మనమిద్దరం నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం అడుగునవుతాను నీ వెంట నేను తోడుగా నడవగా చివరి దాకా గొడుగునవుతాను ఇకపైన నేను వానలో నిన్నీలా తడవనీక నిన్నొదిలి క్షణమైన అసలుండలేను చిరునవ్వునవుతాను పెదవంచునా నీ...