Neeli neeli Aakasham song Lyrics | 30 Rojullo Preminchadam ela | Pradeep
Song: Neeli Neeli Aakasam
Movie: 30 Rojullo Preminchadam Ela
Singers: Sid Sriram, Sunitha
Music Director: Anup Rubens
Lyrics: Chandra Bose
పల్లవి :
నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా…
నెలవంకకు ఇద్దామనుకున్నా.. ఓహో ఓహో
నీ నవ్వుకు సరిపోదంటున్నా…
నువ్వే నడిచేటి తీరుకే…
తారలు మొలిచాయి నేలకే…
నువ్వే వదిలేటి శ్వాసకే…
గాలులు బ్రతికాయి చూడవే…
ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే…
నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా
చరణం – 1
ఓహో వానవిల్లులో ఉండని రంగు నువ్వులే
ఏ రంగుల చీరను నీకు నెయ్యాలే
నల్ల మబ్బులా మెరిసే కళ్లు నీవిలే
ఆ కళ్లకు కాటుక ఎందుకెట్టాలే
చెక్కిలిపై చుక్కగా దిష్టే పెడతారులే
నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే
ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా
ఏది నీ సాటి రాదిక అంటు ఓడాను పూర్తిగా
కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా
నీలి నీలి ఆశాశం ఇద్దామనుకున్నా
నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా
చరణం – 2
ఓహో అమ్మ చూపులో వొలికే జాలి నువ్వులే
ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలే
నాన్న వేలితో నడిపే ధైర్యమే నీదే
నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలే
దయ కలిగిన దేవుడే మనలను కలిపాడులే
వరమొసగే దేవుడికే నేనేం తిరిగివ్వాలే
ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా
ఏది నీ సాటి రాదిక అంటూ అలిసాను పూర్తిగా
కనుకే మళ్లి మళ్లీ జన్మనెత్తి నిన్ను చేరనా
నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా
Leave a Reply