నా మనసుకి ప్రాణం పోసి
నీ మనసుని కానుక చేసి
నిలిచావే ప్రేమను పంచి… ఓ ఓ ఓ…
నా మనసుకి ప్రాణం పోసి
నీ మనసుని కానుక చేసి
నిలిచావే ప్రేమను పంచి… ఓ ఓ ఓ…
నా వయసుకి వంతెన వేసి
నా వలపుల వాకిలి తీసి
మది తెరితెరిచీ ముగ్గే పరచి
ఉన్నావు లోకం మరిచి
నా మనసుకి ప్రాణం పోసి
నీ మనసుని కానుక చేసి
నిలిచావే ప్రేమను పంచి… ఓ ఓ ఓ…

నీ చూపుకి సూర్యుడు చలువాయే
నీ స్నర్శకి చంద్రుడు చెమటాయే
నీ చొరవకి నీ చెలిమికి
మొదలాయే మాయే మాయే
నీ అడుగుకు ఆకులు పూవులాయే
నీ కులుకికి కాకులు కవులాయే
నీ కళలకి నీ కథలకి
కాదలాడే హాయే హాయే
అందంగా నన్నే పొగిడి
అటుపైనా ఎదో అడిగి
నా మనసునే ఒక సరస్సులో
అలజడులే సృష్ట్టించావే
నా మనసుకి ప్రాణం పోసి
నీ మనసుని కానుక చేసి
నిలిచావే ప్రేమను పంచి… ఓ ఓ ఓ…

ఒకమాట ప్రేమగా పలకాలే
ఒక అడుగు జతపడి నడవాలే
ఆ గురుతులు నా గుండెలో
ప్రతిజన్మకు పదిలం పదిలం
ఒకసారి ఒడిలో ఒదగాలే
ఎదపైనా నిదరేపోవాలే
తియతీయని నీ స్మృతులతో
బతికేస్తా నిమిషం నిమిషం
నీ ఆశలు గమనించాలి
నీ ఆర్తుత గుర్తించాలి
ఎటు తేలకా బదులీయకా
మౌనంగా చూస్తుండాలి…