Kotha Janta arere idhi pillupo tholli valupo song lyric

అరెరే అది పిలుపో తొలి వలపో మైమరపో
అదిరే కుడి కన్నై నిను చేరే మలుపో
నువు నచ్చావన్నదిగా నిను రా రమ్మనదిగా
వడి వడిగా పరుపైపో తనవడిలో పడిపో
ఆకాశానైనా ఇలదించే ఏమహిమో
భూగోలానైనా నడిపించే బలమో
ప్రియస్వరమై పిలిచెనుగా అనువనువును కుదిపెనుగా
వడి వడిగా పరుపైపో తనవడిలో పడిపో
లాగే దారమే ఎటుదాగుందో ఏమో
వెలిపోతుందలా మనసూ………………..
గాల్లో బానమే పువ్వై తాకిందేమో
విరబూసిందిగా వయసూ…………..
హేయ్ ఒకటికి ఇంకొకటని కలిపీ రెండంటున్నా లోకం
ఒకటేనని నమ్మేస్తుందీ వెలకువలో మైకం………
సత్యంతో పనిలేదంటూ స్వప్నంలోనే పయనం
చీకటినే సిరివెన్నలగా చూస్తుంది నయనం
నాకేం వద్దులే అంతా నీదే ప్రేమా అనిపిస్తుందీ సమయం
నచ్చిన దారికే గొడుగై పువ్వుల మడుగై అడుగేస్తుంది నీహృదయం
హే ఎనిన్నా మొన్నల కాలం గురుతుకు రాన్నంటుందే
రాబోయే రేపటికైనా ఆలోచనలేదే……………….
ఈనిమిషం లోనే ఉన్నా ఏచోటో తెలిదే…………..
జతమనసున చెరిసగమై నీమనసే ఒదిగిందే………….
ఎపుడైతే ప్రేమా మొదలైందే నీ ఎదలో
అపుడే నీస్వార్దం కలిసిందే గాల్లో
ఇక ప్రేమంటే నువ్వూ తానే నీ చిరునవ్వూ
వడి వడిగా పరుపైపో తనవడిలో పడిపో…
Leave a Reply