Director : Sri Ram venu.
DOP : P. S Vinod.
Song: Kanti Papa
Singers – Armaan Malik, Deepu & thaman S
Lyrics – Ramajogayya Sastry
Music: Thaman S
కంటి పాపా కంటి పాపా చెప్పనైనలేదే
నువ్వంతలా అలా ఎన్ని కళలు కన్నా
కాలి మువ్వా కాలి మువ్వా సవ్వడైనా లేదే
నువ్విన్నినాల్లిలా వెంట తిరుగుతున్నా..
నీ రాక ఏరువాక, నీ చూపే ప్రేమలేఖ,
నీలో నువాగిపోక, కలిసావే కాంతిరేఖ,
అంతులేని ప్రేమ నువ్వై
ఇంత దూరం వచ్చినాక
అందమైన భారమంతా నాకు పంచినాకా….
మొదలేగా కొత్త కొత్త కథలు
మొదలేగా కొత్త కొత్త కళలు
ఇకపైన నువ్వు నేను బదులు
మానమన్న కొత్త మాట మొదలు
కంటి పాపా కంటి పాపా చెప్పనైనలేదే
నువ్వంతలా అలా ఎన్ని కళలు కన్నా
సుదతి సుమలోచిని సుమనోహర హాసిని
రమణీ ప్రియా భాషిణి కరుణగుణా బాసిని
మనసైన వాడిని మనువాడిన ఆమని
బదులీయవే చెలి నువ్వు పొందిన ప్రేమని
పండంటి ప్రాణాన్ని కనవే కానుకగా
ఎదలో ఏకాంతమూ ఏమైందో ఏమిటో
ఇదిగో నీ రాకతో వెళ్ళిపోయింది ఎటో
నాలో మరో నన్ను చూసా నీకో స్నేహితుణ్ని చేశా
కాలం కాగితాలపై జంట పేర్లుగా నిన్ను నన్ను రాసా
ఆకాశం గొడుగు నీడ పుడమేగా పూల మేడా
ఏ చూపులు వదలకుండా ప్రేమే మన కోటగోడ
నాకు నువ్వై నీకు నేనై ఏ క్షణాన్ని వదలకుండా
గురుతులెన్నో పెంచుకుందాం గుంట చోటు నిండా
మొదలేగా కొత్త కొత్త కథలు
మొదలేగా కొత్త కొత్త కళలు
ఇకపైన నువ్వు నేను బదులు
మానమన్న కొత్త మాట మొదలు