జన్మ నీదేలే మరుజన్మ నీకేలే
జతను విడిచావో చితికి పోతానే
ప్రియతమా ప్రణయమా కుమలకే ప్రాణమా
అడుగు నీతోనే
జన్మ నీదేలే మరుజన్మ నీకేలే
జతను విడిచావో చితికి పోతానే

కన్నుల బాధను కన్నుల నీరే తెలుపును
వలచిన హ్రుదయము తెలపదులే
గడ్డిలో పిచ్చిగా పూసిన పువ్వులే ఎన్నడు
దేవత పూజకు నోచవులే
మెరుపుల్లో తీగల మీద మైనా కడుతుందా
మన ప్రేమకు ఓటమి రానే రాదు
ప్రతి నదికి మలుపులు తధ్యం బ్రతుకుల్లో బాధలు నిత్యం
ఎద గాయం మాన్పును కాలం
సిరివెన్నెల మాత్రం నమ్మి చిగురాకులు బ్రతుకవు కాదా
మిణిగురులే ఓడి కిరణం

తల్లిని తండ్రిని కాదని ప్రేమే కోరిన చిలుకకు గూడుగ నే ఉన్నా
గుండెపై నీవుగ వాలిన ప్రేమలో ఎదురుగా పిడుగులే పడినను విడువనులే
స్నానానికి వేణ్ణిలవుతా అవి కాచే మంటనవుతా
హ్రుదయంలో నిన్నే నిలిపాలే
నిదురించే కంట్లో నేనే పాపల్లే మేలుకుంటా
కలలోనే గస్తీ కాస్తాలే
నేనంటే నేనే కాదు నువు లేక నేనే్లేను
నీ కంటి రెప్పల్లే ఉంటా

జన్మ నీదేలే మరుజన్మ నీకేలే జతను విడిచావో చితికి పోతానే
ప్రియతమా ప్రణయమా కుమలకే ప్రాణమా
అడుగు నీతోనే..అడుగు నీతోనే ..అడుగు నీతోనే ..అడుగు నీతోనే…