ఎవరీ అమ్మాయని అడిగా ఆనాడు
తానె నా ప్రాణమని తెలిసే ఈనాడు
నన్నే చూసేనే ఏదో అడిగెనే,
మాయే చేసెనే.. ఒహోహో
చూపుతో నవ్వెనే చూపులు రువ్వేనే,
గుండె గిల్లెనే ఒహోహో
చుక్కల్లో నడుమ జాబిల్లి తానే
రెక్కలు తొడిగే సిరిమల్లి తానై
ఏదో చేసే నన్నే ….

ఎవరీ అమ్మాయని అడిగా ఆనాడు
తానె నా ప్రాణమని తెలిసే ఈనాడు

మా ఇంటి ముంగిట్లో తను వేసే ముగ్గులు
ఎప్పటికీ చెరిగి పోరాదంటా
తన పెదవుల మందారం
తన పాపిట సింధూరం
నా గుండెకి సూర్యోదయమంటా
అందాల గాజుల లాగా
తన చేయి స్పర్శ తగిలితే చాలు
తన కాలి మువ్వ సవ్వడి నేనై ,
కల కాలముంటే మేలు
కమ్మని చెవిలో కబురే చెప్పెనే
సిగ్గులె బుగ్గ మొగ్గైంది నీవేనే
ఏదో చేసే నన్నే ..హే హే …

ఎవరీ అమ్మాయని అడిగా ఆనాడు
తానె నా ప్రాణమని తెలిసే ఈనాడు

నే తనని చూస్తే ఎటో చూస్తుంది
నే చూడకుంటే నన్నే చూసే
తన నవ్వు చూపి, నే చూస్తే ఆపి
పైపైకి నటనేదో చేసే
స్త్రీ హృదయం అద్వైతం లాగా
ఏనాడూ ఎవరి కర్థమే కాదు
మగవాడి మనసూ తపియించే వయసు
ఆడవాళ్ళకి అలుసు
మది గాయపడ్డాక నాకోసం వస్తుంది
వానే వెలిసాక గొడుగిచ్చి నట్టుంది
ఏదో చేసే నన్నే ఏ హే హే ….

ఎవరీ అమ్మాయని అడిగా ఆనాడు
తానె నా ప్రాణమని తెలిసే ఈనాడు
నన్నే చూసేనే ఏదో అడిగెనే,
మాయే చేసెనే.. ఒహోహో
చూపుతో నవ్వెనే చూపులు రువ్వేనే,
గుండె గిల్లెనే ఒహో హో
చుక్కల్లో నడుమ జాబిల్లి తానె
రెక్కలు తొడిగే సిరిమల్లి తానై
ఏదో చేసే నన్నే హే….