This fantastic lyrics of chkkala thotalo ekkadunnavo is from the movie Allari Bullodu,
but see the vido embeded here which contains the action of a unknown girl who did great expressions.
Movie: Allari Bullodu (1978)
Song: Chukkala Thotalo
Cast & Crew: Krishna, Jayapradha
Singers: S P Balasubrahmanyam, P Susheela
Music: Chakravarthy
Lyrics: Veturi
Director: G.C.Shekhar

చుక్కల తోటలో ఎక్కడున్నావో
పక్కకు రావే మరుమల్లె పువ్వా..
చక్కని జాబిలీ ఎక్కడున్నానో
నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను

—-మ్యూజిక్—

నీలి నీలి నీ కురుల నీలాల మేఘాల విరిసింది మల్లికా నా రాగ మాలిక
అల్లిబిలి నీ కౌగిట అల్లుకున్న నా మమతా కోసిరింది కోరిక అనురాగా గీతికా
నీ ముగా చూపులలో చెలరేగే పిలుపులలో
నీ పట్టువిడుపులలో సుడిరేగే వలపులలో
కన్ను కన్ను కలవాలి వెన్నెలై పోవాలి
చీకటి వెన్నల నీడలలో దాగుడుమూతలు ఆడాలి..

చుక్కల తోటలో ఎక్కడున్నావో
పక్కకు రావే మరుమల్లె పువ్వా..
చక్కని జాబిలీ ఎక్కడున్నానో
నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను

—-మ్యూజిక్—

ఆకలైన నాకు తెలుసు కౌగిలెంత తీయ్యనిదో
కౌగిలింత కె తెలుసు ఆకలెంత తీరనిదో
వేచి ఉన్న నాకు తెలుసు విరహం ఎంత తీయనిదో
కాచుకున్న నీకు తెలుసు కలయికలెంత కమ్మనిదో

ఈ పూల వనాలలో తడిసిన నీ అందాలు
ఆ ఆ ఆ ఈ పులా సొగసులలో కురిసిన మకరందాలు
నీలో తీగలు మీటాలి నాలో రాగం పలకాలి
లోకం మరిచిన మైకం లో మనమే ఏకం కావాలి

చుక్కల తోటలో ఎక్కడున్నావో
పక్కకు రావే మరుమల్లె పువ్వా..
చక్కని జాబిలీ ఎక్కడున్నానో
నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను