Song: Chiguraku Chatu
Album: Gudumba Shankar
Director: Veera Shankar
Actors: Pawan Kalyan, Meera Jasmine
Music Director: Mani Sharma
Singers : S.P.Charan, Sujatha
Lyrics: Sirivennela Sitarama Sastry

చిగురాకు చాటు చిలకా ఈ అలజడి ప్రేమేగా
అలవాటు లేదు గనక మది సులువుగా నమ్మదుగా
చిగురాకు చాటు చిలకా తను నడవద ధీమాగా
అనుకోని దారి గనక ఈ తికమక తప్పదుగా
తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా
అయితే అది తేలనిదే అడుగు పడదుగా
సరికొత్తగ నా వంక చూస్తుంది
చిత్రంగా ఏమైందో స్పష్టంగా బయటపడదుగా

చెప్పకు అంటూ చెప్పమంటూ చర్చ తేలేనా
తప్పనుకుంటూ తప్పదంటూ తరకమాగేనా
సంగతి చూస్తూ జాలి వేస్తూ కదలలేకున్నా
తేలని గుట్టు తేనెపట్టు కదపలేకున్నా
వణికే నా పెదవుల్లో తొణికే తడి పిలుపేదో
నాకే సరిగా ఇంకా తెలియకున్నది
తనలో తను ఏదేదో గొణిగే ఆ కబురేదో
ఆ వైనం మౌనంలో మునిగి వున్నది

ఎక్కడినుంచో మధురగానం మదిని మీటింది
ఇక్కడి నుంచే నీ ప్రయాణం మొదలు అంటోంది
గలగల వీచే పిల్లగాలి ఎందుకాగింది
కొంపలుముంచే తుఫానొచ్చే సూచనేమో ఇది
వేరే ఏదో లోకం చేరే ఉహల వేగం
ఏదో తీయని మైకం పెంచుతున్నది
దారే తెలియని దూరం తీరే తెలపని తీరం
తనలో కలవరమేదో రేపుతున్నది

AshEver Green Lyrical Songs
Song: Chiguraku Chatu Album: Gudumba Shankar Director: Veera Shankar Actors: Pawan Kalyan, Meera Jasmine Music Director: Mani Sharma Singers : S.P.Charan, Sujatha Lyrics: Sirivennela Sitarama Sastry చిగురాకు చాటు చిలకా ఈ అలజడి ప్రేమేగా అలవాటు లేదు గనక మది సులువుగా నమ్మదుగా చిగురాకు చాటు చిలకా తను నడవద ధీమాగా అనుకోని దారి గనక ఈ తికమక తప్పదుగా తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా అయితే అది తేలనిదే అడుగు పడదుగా సరికొత్తగ నా...