అమ్మాయి బాగుంది అందంగా ఉంటుంది
ఏవేవో చేసింది వారెవ్వా
మందారంలా ఉంది మువ్వల్లే నవ్వింది
రాగాలే తీసింది వారెవ్వా
గుండెలోపలా ఎండమావిలా ఎందుకిలా ఈ మాయ
కంటిపాపాలో స్వప్నమే ఇలా ఎదురుగా రాదే
ఇలా ఓ ఓ
అమ్మాయి బాగుంది అందంగా ఉంటుంది
ఏవేవో చేసింది వారెవ్వా

ఎవ్వరిది ఈ యవ్వన వీణ మైనా
గుండెలోన మాటలకి అందని జాణ
అందంలో అప్సరసేనా అవునా అందుకోన
ఓ ఆమె నవ్వే పాడుకో మౌన సంగీతం
కాలి మువ్వై మొగుతుంది ప్రేమ సంకేతం
ఎటు చూసినా అటు వైపునే ఎదురయే ఆ రూపం
అమ్మాయి బాగుంది అందంగా ఉంటుంది
ఏవేవో చేసింది వారెవ్వా
మందారంలా ఉంది మువ్వల్లే నవ్వింది
రాగాలే తీసింది వారెవ్వా

చెప్పకనే చెప్పెను ప్రాయం ఎప్పటికి తీరని దాహం మొహం ఆహా
వింత మొహం ఆహా
గుప్పెటలో దాగని కాలం గుప్పుమని ఆశల తీరం దూరం
ఎంత దూరం ఓ ఓ
ఆమె తోనే చేయమంది జన్మలో స్నేహం
ఆమె తోనే సాగమంది తోడుగా ప్రాణం
సందెవేళలో చల్లగాలిగా తనచే సంతోషం
అమ్మాయి బాగుంది అందంగా ఉంటుంది
ఏవేవో చేసింది వారెవ్వా
మందారంలా ఉంది మువ్వల్లే నవ్వింది
రాగాలే తీసింది వారెవ్వా
గుండెలోపలా ఎండమావిలా ఎందుకిలా ఈ మాయ
కంటిపాపాలో స్వప్నమే ఇలా ఎదురుగా రాదే
ఇలా ఓ ఓ😍