ఏమైంది ఈ వేళ
ఎదలో ఈ సందడేల
మిల మిల మిల మేఘమాల
చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేల

ఏ శిల్పి చెక్కెనీ శిల్పం
సరికొత్తగ ఉంది రూపం
కనురెప్ప వేయనీదు ఆ అందం
మనసులోన వింత మోహం
మరువలేని ఇంద్రజాలం
వానలోన ఇంత దాహం

చినుకులలో వాన విల్లు నేలకిల జారెనె
తళుకుమనే ఆమె ముందు వెల వెల వెల బోయనె
తన సొగసె తీగలాగ నా మనసె లాగెనె
అది మొదలు ఆమె వైపె నా అడుగులు సాగెనె
నిశీధిలొ ఉషోదయం ఇవాలిల ఎదురే వస్తె
చిలిపి కనులు తాళమేసె
చినుకు తడికి చిందులేసె
మనసు మురిసి పాట పాడె
తనువు మరిచి ఆటలాడె

ఏమైంది ఈ వేళ
ఎదలో ఈ సందడేల
మిల మిల మిల మేఘమాల
చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానె చిరు చెమటలు పోయనేల

ఆమె అందమె చూస్తె మరి లేదు లేదు నిదురింక
ఆమె నన్నిల చూస్తె ఎద మోయలేదు ఆ పులకింత
తన చిలిపి నవ్వుతోనె పెను మాయ చేసేన
తన నడుము వొంపులోనె నెలవంక పూచెన
కనుల ఎదుటె కలగ నిలిచ
కలలు నిజమై జగము మరిచ
మొదటి సారి మెరుపు చూసా
కడలిలాగె ఉరకలేసా…